'ఆర్ ఎక్స్ 100' నుండి మ‌రో వీడియో సాంగ్ విడుద‌ల‌

Thu,July 26, 2018 11:47 AM
RX 100  Manasuni Patti Video Song released

ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ఆర్ ఎక్స్ 100. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన అజ‌య్ భూప‌తి ఆర్ ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యాడు. మొద‌టి చిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను చూపించి అంద‌ర‌కు అవాక్క‌య్యేలా చేశాడు. జూలై 12న విడుద‌లైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయ్యేలా తెర‌కెక్కించి స‌ఫ‌లం అయ్యాడు ద‌ర్శ‌కుడు . ముఖ్యంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేయ‌డాన్ని అద్భుతంగా చూపించడంతో సినీ ప్రేక్ష‌క‌లోకం కాస్త థ్రిల్‌గా ఫీలైంది. ఇప్ప‌టికి ఈ మూవీ మంచి కలెక్ష‌న్స్‌తోనే దూసుకెళుతుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించ‌గా, ఇది సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయింది. తాజాగా మ‌న‌సుని ప‌ట్టే అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. హ‌రిచ‌ర‌ణ్‌, ఉమా నేహా పాడిన ఈ పాట విడుద‌లైన కొద్ది గంట‌ల‌లోనే ఈ సాంగ్‌ని ఆరు ల‌క్ష‌ల‌కి పైగా వీక్షించారు. కార్తికేయ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు.

4421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles