తుపాను బాధితుల‌కి కుర్ర హీరో సాయం

Wed,October 17, 2018 10:06 AM
rx 100 hero helps to titli victims

తిత్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన సిక్కోలు వాసులకు అండగా, సహాయం చేయడానికి తాము సైతం అంటూ తెలుగు హీరోలు ముందుకొస్తున్న విష‌యం విదిత‌మే. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుపాను సృష్టించిన బీభత్సం వ‌ల‌న నిరాశ్ర‌యిల‌యిన వారికి అండ‌గా నిలిచేందుకు ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్, క‌ళ్యాణ్ రామ్‌, సంపూర్ణేష్ బాబు, నిఖిల్ త‌దిత‌రులు కొంత‌ న‌గ‌దుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి అందజేశారు. తాజాగా తితలీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్రకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ . తాను సీఎం సహాయనిధికి రూ.2 లక్షలు అందజేస్తున్నట్లు తెలియ‌జేశారు. ఆర్ఎక్స్ 100తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ కుర్ర హీరో ప్ర‌స్తుతం క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. త‌మిళం, తెలుగులో తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ బాక్స‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. తెలుగు డెబ్యూ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles