26 సెంట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఆర్ ఎక్స్ 100

Fri,August 31, 2018 08:58 AM
rx 100 completes 50 days

త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100 .అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 మూవీ 2 కోట్ల బడ్జెట్ తో వచ్చి 15 కోట్ల పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఈ సినిమా హిట్ అవడంతో రీమేక్ హక్కులు భారీగా సేల్ అయ్యాయి. ఈ సినిమా హిందీ వర్షన్ అజయ్ డైరక్షన్ లోనే వస్తుందని తెలుస్తుండగా.. తమిళ రీమేక్ మాత్రం ఆది పినిశెట్టి సొంతం చేసుకున్నాడట‌. చిన్న చిత్రంగా థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ చిత్రం 26 సెంట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ల‌భించిన ఆద‌ర‌ణ చూసి యూనిట్ చాలా సంతోషంగా ఉంది. కేర‌ళ వర‌ద బాధితుల‌కి సాయం అందించాల‌నే ఉద్ధేశంతో సినిమాలో ఉప‌యోగించిన బైక్‌ని యూనిట్ వేలం వేస్తున్న విష‌యం తెలిసిందే. కనీస బిడ్డింగ్ మొత్తాన్ని రూ. 50,000 గా నిర్ణయించారు.

ఆర్ ఎక్స్ హండ్రెడ్ తమిళ్ రీమేక్ లో ఆది పినిశెట్టినే హీరోగా నటించనున్నాడని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్ గా తాప్సీని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీలో లిప్ లాక్ లు, హాట్ సీన్స్ వుండటంతో తాప్సీ అన్నింటికి ఒప్పుకుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కోలీవుడ్‌లో భారీ చర్చే జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

2714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles