విరాళం కోసం ఆర్ ఎక్స్ 100 బైక్ వేలం

Tue,August 21, 2018 09:33 AM
rx 100 bike auction for kerala

త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100 .అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 మూవీ 2 కోట్ల బడ్జెట్ తో వచ్చి 15 కోట్ల పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఈ సినిమా హిట్ అవడంతో రీమేక్ హక్కులు భారీగా సేల్ అయ్యాయి. ఈ సినిమా హింది వర్షన్ అజయ్ డైరక్షన్ లోనే వస్తుందని తెలుస్తుండగా.. తమిళ రీమేక్ మాత్రం ఆది పినిశెట్టి సొంతం చేసుకున్నాడట‌. అయితే గ‌తంలో ప‌లు సినిమాల‌కి సంబంధించిన ప్రాప‌ర్టీస్‌ని విరాళం వేసి వాటితో వ‌చ్చిన సొమ్ముని మంచి ప‌ని కోసం ఉప‌యోగించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కి సాయం అందించాల‌నే ఉద్దేశంతో ఆర్ ఎక్స్ 100 చిత్రంలో ఉప‌యోగించిన బైక్‌ని వేలం వేయ‌నున్నార‌ట‌. కనీస బిడ్డింగ్ మొత్తాన్ని రూ. 50,000 గా నిర్ణయించారు. ఆసక్తిగల వారు వారి బిడ్డింగ్ మొత్తాన్ని ఈ 9100445588 నెంబర్ కు వాట్సాప్ చెయ్యగలరు. లేదా ఈ మెయిల్ ఐడి rx100auction@gmail.com. మెయిల్ చెయ్యగలరు. ఇప్ప‌టికే కేర‌ళ వ‌ర‌ద బాధితుకి రాజ‌మౌళి, చిరంజీవి, మ‌హేష్‌, నాగార్జున ,అల్లు అర్జున్ ,రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు సాయం అందించిన సంగ‌తి తెలిసిందే.2552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles