గ‌ల్లీబాయ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అవాస్త‌వం అంటున్న స‌న్నిహితులు

Tue,April 16, 2019 10:10 AM

బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్, గ్లామ‌ర్ బ్యూటీ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జోయా అక్త‌ర్ తెరకెక్కించిన చిత్రం గ‌ల్లీబాయ్. ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి కూడా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.ఈ మూవీని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.


గ‌ల్లీబాయ్ చిత్ర రీమేక్ రైట్స్ ప్ర‌ముఖ సంస్థ ద‌క్కించుకుంద‌ని తెలుస్తుండ‌గా, రీమేక్‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే నిర్మాత‌లు ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా జరిపార‌ని , ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం చేస్తున్నారు . అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌న్నిహితులు మాత్రం ఈ వార్త‌ల‌ని కొట్టి పారేస్తున్నారు. గ‌ల్లీ బాయ్ రీమేక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అని వారు పేర్కొన్నారు. విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రష్మిక కథానాయిక. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 31న విడుద‌ల కానుంది. మరో వైపు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఓ సినిమా చేస్తుండగా, దీని త‌ర్వాత శివ నిర్వాణతో ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles