అస్వ‌స్థ‌త‌కి గురైన నాగార్జున‌..!

Sun,August 25, 2019 09:48 AM
rumors comes on nagarjuna health

కింగ్ నాగార్జున ఆగ‌స్ట్ 29, 2019న 60వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్నారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను న‌వ యువ‌కుడిలా ఎంతో ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం నాగ్ అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయ‌న బ‌ర్త్‌డే ఏర్పాట్ల గురించి చ‌ర్చించేందుకు అభిమానులు ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా నాగ్ వారితో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌ప‌లేద‌ని స‌మాచారం. అయితే నిన్న జ‌రిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఎంతో యాక్టివ్‌గా క‌నిపించిన నాగార్జున అస్వ‌స్థ‌త‌కి గురైన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత వాస్త‌వం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఆ మ‌ధ్య మ‌న్మ‌థుడు 2 ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో నాగార్జున చేతికి చిన్న‌క‌ట్టుతో క‌నిపించారు. ఏమైంద‌ని విలేక‌రులు అడ‌గ‌గా, జిమ్‌లో క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కొంత నొప్పి రావ‌డంతో అలా బ్యాండేజ్ క‌ట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. ఏదేమైన నాగార్జున ఈ వ‌య‌స్సులోను ప‌ర్‌ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ త‌న అభిమానుల‌కి ఆద‌ర్శంగా నిల‌స్తుండ‌డం గొప్ప విష‌య‌మనే చెప్పాలి.

6004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles