కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్. ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ధర్మ మా ఊరి గ్రామ దైవం అంటూ చెప్పే సంభాషణలతో షురూ అయ్యే టీజర్..యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది. ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా..బయటకొచ్చిన సింహంలా ఆగను..ఇక వేటే అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఈలలు వేసేలా చేస్తున్నయి.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇప్పటికే చిత్రంలో బాలయ్య లుక్‌కి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల చేశారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని టీం భావిస్తుంది.