మ‌రో సాంగ్‌తో అల‌రించిన 'సంజూ'

Wed,June 20, 2018 01:53 PM
Ruby Ruby Full Audio Song from SANJU released

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం సంజూ. జూన్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. మూవీ పోస్టర్ లేదా సాంగ్స్ విడుద‌ల చేస్తూ సినిమాపై భారీగా ఆస‌క్తి పెంచుతున్నారు చిత్ర బృందం. ఇటీవ‌ల రెండు నిమిషాల ట్రైల‌ర్ విడుద‌ల చేసిన టీం ఇందులో సంజ‌య్ ద‌త్‌లోని ఆరు కోణాల‌ని చూపించారు. ఈ ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు . వీటికి సినీ ల‌వ‌ర్స్ నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. రీసెంట్‌గా కర్ హర్ మైదాన్ ఫతే అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో డ్రగ్స్ బారిన పడి సంజయ్ ఎలాంటి దుస్థితి అనుభవించాడో కళ్లకు కట్టినట్లు చూపించారు . తాజాగా ఏఆర్ రెహ‌మాన్ సంగీతం స‌మ‌కూర్చిన రూబి రూబబి అనే సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కి ఇర్షాద్ క‌మీల్ లిరిక్స్ రాయ‌గా శ‌శ్వ‌త్ సింగ్‌, పూర్వీ కౌటిష్ క‌లిసి పాడారు. మ‌రి ఈ రొమాంటిక్ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి

1834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles