సంజూని చీల్చి చెండాడిన ఆరెస్సెస్ పత్రిక

Thu,July 12, 2018 03:35 PM
RSS affiliated Panchajanya tear apart Sanju Movie for glorifying Sanjay Dutt and Underworld

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అన్ని విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా ఆరెస్సెస్‌కు చెందిన పాంచజన్య పత్రిక సంజూ మూవీని చీల్చి చెండాడింది. అండర్‌వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ మూవీ తీసినట్లుగా ఉన్నదని ఆ పత్రిక అభిప్రాయపడింది. ఈ సందర్భంగా హాలీవుడ్ ఇండస్ట్రీతో బాలీవుడ్‌ను పోల్చింది. ఓవైపు మన రామానుజన్‌ను ఆకాశానికెత్తుతూ హాలీవుడ్ వాళ్లు ద మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ అనే సినిమా తీస్తే.. ఇటు బాలీవుడ్ మాత్రం అండర్‌వరల్డ్‌ను పొగుడుతున్నది అంటూ పాంచజన్య పత్రిక విమర్శించింది.

ముంబై పేలుళ్లలో సంజయ్‌దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్‌ను, తన కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పత్రిక ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. పోలీసులకు తెలియకుండా మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్ అంటూ పాంచజన్య పత్రిక సంజూ మూవీ తీవ్రంగా విరుచుకుపడింది.

డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీని కూడా వదల్లేదు. ఈయన గతంలో తీసిన పీకే సినిమా హిందువులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించింది. ఇలాంటి వాడిని ఓ హీరోగా చూపించడం కరెక్టేనా? అతన్ని బాలీవుడ్ ఓ ఆదర్శవంతమైన వ్యక్తిగా చూపించాలనుకుంటున్నదా? ఈ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ గతంలో పీకే మూవీ ద్వారా హిందూ ధర్మాన్ని ఎగతాళి చేశాడు. సంజయ్ దత్ అంత గొప్ప పని ఏం చేశాడని అతని జీవిత చరిత్రను తెరకెక్కించడానికి అని పాంచజన్య పత్రిక ప్రశ్నించింది. అండర్ వరల్డ్‌పై సినిమాలు తీయడాన్ని కూడా ఈ పత్రిక తప్పుబట్టింది. ఈ సినిమాలకు గల్ఫ్ నుంచి పెట్టుబడులు వస్తున్నాయా అని ఆ పత్రిక నిలదీసింది.

3685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles