వ‌చ్చే ఏడాది నుండి ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ షురూ..!

Tue,November 12, 2019 12:49 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. అన్ని భాష‌ల‌లోను ఇదే టైటిల్‌తో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. జూలై 30,2020న విడుద‌ల కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుందోన‌ని అభిమానులు ఆలోచ‌న‌లు చేస్తూ ఉన్నారు. ముఖ్య‌మైన రోజుల‌లో సినిమాకి సంబంధించి ఏదో ఒక పోస్టర్ విడుద‌ల అవుతుంద‌ని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసినప్ప‌టికి అది జ‌ర‌గ‌లేదు.


వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జ‌న‌వ‌రి 1 నుండి మొద‌లు పెట్ట‌నున్నాడ‌ట జ‌క్క‌న్న‌. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఎన్టీయార్ ఫస్ట్‌లుక్ విడుద‌ల చేసి , ఆ త‌ర్వాత‌ సంక్రాంతికి చెర్రీ లుక్ రిలీజ్ చేయ‌నున్నాడ‌ట‌. ఇక కొద్ది గ్యాప్ తీసుకుంటూ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న వారి లుక్స్ ఒక్కొక్క‌టిగా విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. బాహుబ‌లి సినిమా విష‌యంలో రాజ‌మౌళి ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ మంచిగా వ‌ర్క‌వుట్ కావ‌డంతో ఆర్ఆర్ఆర్‌ని కూడా అదే స్టైల్‌లో ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.

1181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles