ఘ‌నంగా ప్రారంభ‌మైన 'ఆర్ఆర్ఆర్' పూజా కార్య‌క్ర‌మం

Sun,November 11, 2018 11:28 AM
rrr movie launched

రాజ‌మౌళి క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఈ రోజు ఉద‌యం 11గం.ల‌కి లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది. లాంచనంగా ప్రారంభ‌మైన పూజా కార్య‌క్ర‌మానికి చిరంజీవి, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, రానాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కొద్ది రోజులుగా ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ మూవీ ప‌లు టైటిల్స్‌తో ప్ర‌చారం అవుతుండ‌గా,ఈ రోజు టైటిల్ రివీల్ చేయ‌నున్నార‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పూజా కార్య‌క్రమంలో చిత్ర క్లాప్ బోర్డ్ ఉంచ‌గా, దానిపై ఆర్ఆర్ఆర్ అని మాత్ర‌మే రాసి ఉంది. దీంతో అంద‌రు ‘రామ రావణ రాజ్యం’ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌నే చిత్రానికి పెట్టి ఉంటార‌ని భావిస్తున్నారు. కీరవాణి చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా రాజమౌళి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌మాచారం. చిత్రంలో ఓ క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ స‌మంత అని అంటున్నారు.వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.


2855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS