అక్టోబ‌ర్‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం

Sun,July 15, 2018 07:51 AM
rrr movie goes on to the sets in october

బాహుబ‌లి సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ అభిమానులు అంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్. ఆర్ఆర్ఆర్ అనే పేరుతో ఈ మూవీకి ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌లో ఆనందాన్ని క‌లుగ జేస్తున్నాయి. కొంత‌మంది ఆ వార్త‌లలో నిజ‌మెంత తెలియ‌క జుట్టుపీక్కుంటున్నారు. అయితే న‌వంబ‌ర్ నెల‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. మొద‌ట ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌పై సోల్ సీన్స్ తెర‌కెక్కించి, ఆ త‌రువాత ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సీన్స్ షూట్ చేస్తార‌ని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్స్‌ను నిర్మిస్తున్నారట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌లో స్టార్ట్‌ కానుందట. ఇప్ప‌టికే అద్భుత‌మైన క‌థ రెడీ కాగా, దీనిని ఇద్ద‌రు హీరోలు కూడా వినేశార‌ట. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్ ఇందులో ఓ క‌థానాయిక అని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, మ‌రో హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. ఈ మ‌ల్టీ స్టార‌ర్ చిత్ర ప్ర‌ధాన పాత్ర ధారులు ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అర‌వింద స‌మేతతో బిజీగా ఉన్నాడు. రామ్ చ‌ర‌ణ్ బోయ‌పాటి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుదల కానుంది. 2020లో విడుద‌ల కానున్న రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నాడు.

1629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles