‘RRR’ అర్ధం ఇదేనా ?

Sun,November 11, 2018 07:22 AM
rrr full name goes viral

బాహుబ‌లి చిత్రంతో చ‌రిత్ర సృష్టించిన రాజ‌మౌళి చాలా గ్యాప్ త‌ర్వాత మ‌రో భారీ బ‌డ్జెట్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ రోజు ఆ చిత్రం లాంచ‌నంగా ప్రారంభం కానుండ‌గా, ప్ర‌భాస్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా రానున్న‌ట్టు తెలుస్తుంది. చిత్ర వివ‌రాలు, టైటిల్‌తో పాటు మిగ‌తా విష‌యాలు కూడా నేడు వెల్ల‌డించ‌నున్నార‌ని టాక్‌. అయితే రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నున్న ఈ ప్రాజెక్ట్ కొన్నాళ్లుగా ‘RRR’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జ‌రుపుకుంటుంది. అయితే ఈ ‘RRR’లోనే చిత్ర టైటిల్ ఉందని, అది ‘రామ రావణ రాజ్యం’ అని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి దీనిపై చిత్ర బృందం నేడు ఏదైన క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా రాజమౌళి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌మాచారం. చిత్రంలో ఓ క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ స‌మంత అని అంటున్నారు.వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

5533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS