ఆర్ఆర్ఆర్‌కి ఏడాది.. నేడు గుడ్ న్యూస్ చెప్ప‌నున్న రాజ‌మౌళి

Wed,November 20, 2019 08:22 AM

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి శిల్పాన్ని చెక్కిన‌ట్టే త‌న సినిమాల‌ని అందంగా రూపొందిస్తాడ‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. తెలుగు సినిమా కీర్తిని ప్ర‌పంచ దేశాల‌కి ప‌రిచ‌యం చేసిన‌ బాహుబ‌లి సినిమా కోసం దాదాపు 5 ఏళ్ళ‌పాటు క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమా సాధించిన భారీ విజ‌యంతో ఆ క‌ష్టం అంతా మ‌రిచిపోయారు . ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేయ‌నున్నారు.


ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటుంది. దీనిపై చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే నవంబ‌ర్ 11న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైన‌ ఆర్ఆర్ఆర్ చిత్రం న‌వంబ‌ర్ 19 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంది. న‌వంబ‌ర్‌ 19,2019తో ఏడాది పూర్తైన సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం త‌మ‌ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్‌లో గూడ్ న్యూస్ అందించింది. ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మై ఏడాది అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్తైంది. నవంబ‌ర్ 20వ తేదీన చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక‌తో పాటు విల‌న్స్ ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విష‌యం తెలిసిందే. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

1097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles