నేటి నుండి ఆర్ఆర్ఆర్ రెండో షెడ్యూల్ మొద‌లు

Mon,January 21, 2019 12:21 PM
rrr 2nd schedule starts from today

బాహుబ‌లి చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టించిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ (వ‌ర్కింగ్ టైటిల్‌) అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్‌ ఇటీవల పూర్తైంది. త‌న కొడుకు పెళ్లి ప‌నుల‌తో కొద్ది రోజులు బిజీగా ఉన్న రాజ‌మౌళి నేటి నుండి రెండో షెడ్యూల్ మొద‌లు పెట్ట‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీని పిరియాడిక‌ల్ నేప‌థ్యంలో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడ‌ని స‌మాచారం. స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా.. రామ్ చరణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారని అంటున్నారు. మ‌రో క‌థ‌నం ప్ర‌కారం ఆర్ఆర్ఆర్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లు స్నేహితులుగా ఉంటార‌ని, స్వాతంత్య్ర పోరాటం స‌మ‌యంలో చ‌నిపోయిన వీరు మ‌ళ్ళీ జ‌న్మిస్తార‌ని చెబుతున్నారు. అయితే క‌థ సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికి చిత్రానికి మాత్రం ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తార‌ని అంటున్నారు. సెకండ్ షెడ్యూల్ పూర్తవగానే రాజమౌళి తన సినిమా టైటిల్‌ను వెల్లడిస్తారని స‌మాచారం. ఇందులో బాలీవుడ్‌ భామ అదితి రావు హైదరిని ఓ కథానాయికగా ఎంపికచేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట.1797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles