దుమ్ము దులుపుతున్న రౌడీ బేబీ.. 20 కోట్ల వ్యూస్

Thu,February 14, 2019 01:15 PM

యూట్యూబ్‌లో రౌడీ బేబీ సాంగ్ దుమ్ము దులుపుతున్నది. ఈ ఏడాది జనవరి 2న ఈ పాటను అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే 20 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. మారి 2 మూవీలోని ఈ సాంగ్‌లో తమిళ సూపర్‌స్టార్ ధనుష్, సాయి పల్లవి వెరైటీ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తెలుగు మూవీ ఫిదాలోని వచ్చిండె సాంగ్ ఇప్పటివరకు సాయి పల్లవికి ఓ రికార్డుగా ఉండేది. ఈ పాటను యూట్యూబ్‌లో 18 కోట్ల 35 ల‌క్ష‌ల మంది చూశారు. ఇప్పుడా రికార్డును రౌడీ బేబీ సాంగ్ బ్రేక్ చేసింది. అటు ధనుష్‌కు కూడా ఇదే కెరీర్ బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. గతంలో కొలవెరి డి సాంగ్‌ను 17 కోట్ల 50 ల‌క్ష‌ల మంది చూశారు. ఇద్దరు యాక్టర్స్‌కు ఇప్పుడీ రౌడీ బేబీయే బెస్ట్ సాంగ్ నిలవడం విశేషం. ఈ ఏడాది జనవరిలో యూట్యూబ్ పాపులర్ సాంగ్స్ లిస్ట్‌లో ఈ పాట నాలుగో స్థానానికి చేరిన రికార్డు కూడా ఉంది. గతేడాది డిసెంబర్‌లో ఈ మారి 2 మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా ఈ పాటకు కొరియాగ్రఫీ చేయగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా ఇందులోని బీట్స్, డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో రౌడీ బేబీ సాంగ్ వైరల్‌గా మారిపోయింది.


4324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles