రౌడీ బేబీ సాంగ్ మేకింగ్ వీడియో

Sat,March 2, 2019 12:04 PM

ధ‌నుష్‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారి 2 అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రౌడీ బేబీ అనే పాట యూట్యూబ్‌ని ఎంతగా షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది జనవరి 2న ఈ పాటను అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే 20 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీలో రూపొందిన ఈ సాంగ్‌లో ధనుష్, సాయి పల్లవి వెరైటీ స్టెప్పులతో ఆకట్టుకున్నారు . ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది ఈ పాట‌. తాజాగా ఈ సాంగ్‌కి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో పాట‌కి సంబంధించిన విష‌యాల‌ని అభిమానుల‌తో పంచుకున్నారు ద‌ర్శ‌కుడు బాలాజీ మోహ‌న్‌, క‌థానాయిక సాయి ప‌ల్ల‌వి. మీరు రౌడీ బేబి సాంగ్ మేకింగ్‌ వీడియో చూసి ఎంజాయ్ చేయండి .


2116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles