యూ ట్యూబ్‌ని షేక్ చేస్తున్న రౌడీ బేబీ సాంగ్

Thu,March 28, 2019 08:47 AM

మారి చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన మారి 2 చిత్రంలోని రౌడీ బేబీ అనే పాట ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాకి అంత ఆద‌ర‌ణ ల‌భించ‌క‌పోయిన రౌడీ బేబీ అనే సాంగ్ మాత్రం చాలా పాపుల‌ర్ అయింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ పాట‌ని ధ‌నుష్ మ‌రియు ఢీ ఆల‌పించారు. పొయెటు ధ‌నుష్ లిరిక్స్ రాశారు. తాజాగా ఈ సాంగ్ మూడు వంద‌ల మిలియ‌న్స్ వ్యూస్‌ని బీట్ చేసి 500 మిలియ‌న్స్ వ్యూస్ మార్క్ చేరుకునేందుకు దూసుకెళుతుంది. సౌత్‌లో ఓ పాట‌కి ఇన్ని వ్యూస్ రావ‌డం చాలా అరుదు అని అంటున్నారు సినీ పండితులు. ఈ పాట హ‌వా ఇలానే కొన‌సాగితే 50కోట్ల వ్యూస్ రాబ‌ట్టడం పెద్ద క‌ష్ట‌మేమి కాదంటున్నారు. రౌడీ బేబీ సాంగ్‌లో ధనుష్‌, సాయి ప‌ల్ల‌వి వెరైటీ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకున్నారు.


3983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles