కౌశ‌ల్‌తో డిన్న‌ర్ డేట్‌కి వెళ్ళిన దీప్తి.. షాకైన హౌజ్‌మేట్స్‌

Sat,September 22, 2018 08:49 AM
Romantic Setup in the House

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 104లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. మొన్న‌టి దాకా బిగ్ బాస్ హౌజ్ ఎంతో వేడెక్క‌గా తాజా ఎపిసోడ్‌లో మాత్రం చాలా రొమాంటిక్ స‌న్నివేశాలతో పాటు స‌ర‌దా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా త‌న కూతురి బ‌ర్త్‌డే కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్న కౌశ‌ల్‌కి కేక్‌తో పాటు గ్రీటింగ్ కార్డ్ పంపించారు బిగ్ బాస్‌. రెండింటిని చూసి చాలా ఎమోష‌న‌ల్ అయిన కౌశ‌ల్ వాటిని తీసుకోకుండానే స్టోర్ రూం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక తీసుకుంటాన‌ని అన్నారు. అయితే కేక్ మ‌రియు గ్రీటింగ్ కార్డ్ కుటుంబ స‌భ్యులు పంపార‌ని, అవి తీసుకొని ల‌ల్లీ బ‌ర్త్‌డే వేడుక‌ని ఇంటి స‌భ్యుల మ‌ధ్య స‌ర‌దాగా జ‌రుపుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు.

ల‌ల్లీ బ‌ర్త్‌డేకి తాను ఇంట్లోకి వ‌స్తే బాగుంటుంద‌ని కౌశ‌ల్ గీతాతో అన‌గా అక్క‌డ మొద‌లైన గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌లా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కౌశ‌ల్ కేక్ క‌ట్ చేసేందుకు నిరాక‌రించాడు. కేక్ మ‌రియు కార్డ్ కుటుంబ స‌భ్యులు పంపిన‌వ‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో స్టోర్ రూం నుండి కేక్‌ని తీసుకొచ్చి అంద‌రి మ‌ధ్య క‌ట్ చేశాడు కౌశ‌ల్. త‌న కూతురు పంపిన గ్రీటింగ్ కార్డ్ చూసి ఎలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. తనీష్, గీతా, దీప్తి, రోల్ రైడాలు లల్లీకి బర్త్ డే విషెస్ అందిస్తూ.. హ్యాపీగా కేక్‌ను ఎంజాయ్ చేశారు. తాను మ‌రింత ఉన్న‌త స్థాయికి ఎద‌గాల‌ని వారు కోరుకున్నారు.

ఇక ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం బిగ్ బాస్ ఈ వారం ఫ‌న్నీ టాస్క్ ఇచ్చారు. వ‌చ్చే వారం ఇంట్లోకి కావ‌ల‌సిన వ‌స్తువుల పేర్ల‌ని స్మైలీల‌పై రాసి పంపిన బిగ్ బాస్‌.. ట్రేలో ఉంచినస్మైలీ బాల్స్‌ను నోటితో అందుకుని దండలా నిలబడి ఒకరి నోట్లో నుండి మరొకరు నోట్లోకి కింద పడకుండా మార్చుకోవాలి అన్నారు . అలా ఎన్ని స్మైలీ బాల్స్‌ను అందుకుంటారో.. ఆ స్మైలీ బాల్‌‌‌పై రాసిన వస్తువుల్ని గెలుచుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో మొదట గీతా మాధురి స్మైలీ బాల్‌ని నోటితో అందుకుని దీప్తికి అందించగా.. దీప్తి సామ్రాట్‌కి.. సామ్రాట్ తనీష్‌కి.. తనీష్ రోల్ రైడాకి.. రోల్ రైడా కౌశల్‌కి అందించారు. ఇక ఆ త‌ర్వాత డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్ కోసం త‌నీష్ యాంక‌ర్‌గా మార‌గా ఇంట్లో ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు గీతా మాధురి, దీప్తిలు ఇద్దరు హ్యాండ్స‌మ్ ల‌ని ఎంచుకోవాల‌ని బిగ్ బాస్ అన్నారు. అయితే ఇందుకోసం రోల్‌, కౌశ‌ల్‌, సామ్రాట్‌లు ఇద్ద‌రు అమ్మాయిల‌ని ఇంప్రెస్ చేయ‌డంతో పాటు వారు ఎందుకు హ్యాండ్స‌మ్ అనేది చెప్పాల‌ని అన్నారు. ప్ర‌క్రియ‌లో భాగంగా దీప్తి .. కౌశ‌ల్‌ని ఎంచుకోగా, గీతా మాధురి.. రోల్ రైడాని సెల‌క్ట్ చేసుకుంది. ఆ త‌ర్వాత బిగ్ బాస్‌.. దీప్తి, కౌశ‌ల్‌కి లేట్ నైట్ డిన్న‌ర్‌కి వెళ్ళే అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పారు . దీంతో అందంగా ముస్తాబు అయిన వారిద్ద‌రు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స‌ప‌రేట్ ప్లేస్‌లో కూర్చొని రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్ళారు.

క‌బుర్లు చెప్పుకుంటూ, గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ, న‌చ్చిన వంట‌కాలు తింటూ రొమాంటిక్‌మూడ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మ‌ధ్య‌లో తెలుసా.. తెలుసా అనే పాట ప్లే చేయ‌డంతో వారిద్దర మ‌ధ్య రొమాంటిక్ మూడ్ పీక్ స్టేజ్‌కి వెళ్లింది. ఇదే స‌మ‌యంలో ఇంటి స‌భ్యుల‌కి కూడా స్పెష‌ల్ డిన్న‌ర్ అందించారు బిగ్ బాస్‌. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంతో హౌజ్ మేట్స్ థ్రిల్ అయ్యారు. కౌశ‌ల్, దీప్తిల రొమాన్స్ చూసి హౌజ్ మేట్స్ షాక్ అయ్యారు. వారు ఇంత సీరియ‌స్‌గా తీసుకుంటార‌ని నేను భావించ‌లేదు అని రోల్ అన్నాడు. మొత్తానికి 104వ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా థ్రిల్ క‌లిగించింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డంతో హౌజ్‌మేట్స్ త‌ప్పుఒప్పుల‌ని స‌రిదిద్దేందుకు హౌజ్ హెడ్ మాస్ట‌ర్ నాని రాబోతున్నాడు. ఆయ‌న ఈ రోజు హౌజ్‌ని ఎంత హీటెక్కిస్తారో చూడాలి.

8072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles