అనుకున్నట్టుగానే బిగ్‌బాస్ హౌస్ నుంచి రోల్ రైడా ఔట్..

Sun,September 23, 2018 10:23 PM
roll raida eliminated from bigg boss house

అనుకున్నట్టుగానే జరిగింది. గత వారం నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి రోల్ రైడా ఎలిమినేట్ అయ్యాడు. మిగిలిన ఐదుగురు కంటెస్టంట్లు సామ్రాట్, కౌశల్, గీతా మాధురి, తనీశ్, దీప్తి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక సోమవారం నుంచి జరగబోయేది ఫైనల్స్. మరి.. ఫైనల్స్ ను బిగ్ బాస్ ఎంత ఆసక్తిగా తీర్చిదిద్దుతాడా అని బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఆదివారం షో ప్రారంభం కాగానే.. బిగ్ బాస్ విజేతగా మిమ్మల్ని ప్రేక్ష‌కులు ఎందుకు ఎంచుకోవాలి? మీకు ఎందుకు ఓటేయాలని నాని అందరు హౌస్ మేట్స్ ను అడిగాడు. ఒక్కొక్కరు తమ బ్యాక్ గ్రౌండ్, తమలో ఉన్న పాజిటివిటీ, వేరే వాళ్లకు ఎందుకు వేయకూడదో చెప్పి నానిని ఆకట్టుకున్నారు. అయితే.. అందరిలో దీప్తి మాట్లాడిన మాటలు మాత్రం ఆధ్యంతం ఆసక్తిని కలిగించాయి. దీప్తి మాట్లాడిన తీరు బాగుంది. ఇక బిగ్ బాస్ 2 సీజన్ విన్నర్ ఎవరో తెలియాలంటే మాత్రం వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.

6880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS