కౌశ‌ల్‌గా మారిన దీప్తి.. గీతా క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టిన తనీష్‌

Wed,September 26, 2018 08:51 AM
Role Play Task in the House

బిగ్ బాస్ రియాలిటీ షోకి మ‌రో నాలుగు రోజుల‌లో ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. ఇంటిస‌భ్యుల‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎవ‌రికి టైటిల్ ద‌క్కుతుంద‌నే దానిపై ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ లేక‌పోవ‌డంతో హౌజ్‌మేట్స్ స‌ర‌దాగా టైం స్పెంట్ చేస్తున్నారు. 108వ ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యుల‌కి క్యారెక్టర్ స్వేప్ టాస్క్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . అంటే ఇంట్లో ఉన్న ఐదుగురు ఒక‌రి క్యారెక్ట‌ర్స్ ఒక‌రు మార్చుకొని బిగ్ బాస్ చెప్పిన‌ట్టు విడ‌త‌లుగా ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. ఇందు కోసం సామ్రాట్.. దీప్తిలా మారితే కౌశల్.. సామ్రాట్‌లా, దీప్తి... కౌశల్‌లా, తనీష్.. గీతా మాధురిలా, గీతా మాధురి.. తనీష్‌లా నటించారు.

టాస్క్‌లో భాగంగా వారు వీరుగా.. వీరు వారుగా మారి పాత్ర‌ల‌లో జీవించేశారు. సామ్రాట్ అచ్చం దీప్తిలానే హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించ‌గా, త‌నీష్ .. గీత‌మాధురిలా త‌న ప‌ర్‌ఫార్మెన్స్ ఇర‌గ‌దీసాడు. ఇక దీప్తి.. కౌశ‌ల్‌లా న‌టిస్తూ మ‌ధ్య‌మ‌ధ్య‌లో గొడ‌వ‌లు పెట్టుకుంటూ జిమ్ ఏరియాలో జిమ్ చేస్తుంటుంది. ఇక కౌశ‌ల్‌.. సామ్రాట్‌లా, గీతా.. త‌నీష్‌లు కూడా త‌మ పాత్ర‌ల‌కి న్యాయం చేశారు. క్యారెక్ట‌ర్ స్వేప్ టాస్క్‌లో అంద‌రి ప్ర‌ద‌ర్శ‌న బాగున్నందుకు బిగ్ బాస్ అంద‌రిని అభినందించారు. ఇక ఆ త‌ర్వాత ఇంటి స‌భ్య‌లుకి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంట్లో ఉన్న అమేజాన్ కార్డ్స్ ని వెతికి తీయాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌గా,కౌశ‌ల్ తీసిన కార్డ్స్‌లో ఉన్న పాయింట్స్ అంద‌రి కంటే ఎక్కువ ఉండ‌డంతో అత‌నికి 5000 పాయింట్స్ తో ఉన్న అమేజాన్ కార్డ్ బిగ్ బాస్ గిఫ్ట్‌గా అందించారు.

ఇక ఇంట్లోకి అమేజాన్ త‌ర‌పున ప‌లు గిఫ్ట్స్ రాగా వాటిని చూసి మురిసిపోయారు. గీతాకి ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్‌గా రాగా, తనీష్‌కి పింక్ క‌ల‌ర్ టెడ్డీబేర్‌, సామ్రాట్‌కి టీ క‌ప్‌, కౌశ‌ల్‌కి త‌న పిల్ల‌ల‌ని క‌న్ఫెష‌న్ రూంలో చూసి ఎమోష‌న‌ల్ అయిన ఫోటోతో ఉన్న పిల్లో , ఫోటో కార్డ్స్ గిఫ్ట్ , ఇక దీప్తికి త‌న ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్స్ గా వ‌చ్చాయి. ఇవి చూసిన హౌజ్‌మేట్స్ ఎంతో మురిసిపోయారు. మొత్తానికి 108వ ఎపిసోడ్ చాలా స‌ర‌దాగా సాగ‌గా, నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌నున్నాయో తెలియాలంటే కొద్ది గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

4191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles