రోబో 2.0 ఫస్ట్‌లుక్ డేట్ తెలుసా?

Thu,August 18, 2016 08:55 PM
robot 2.0 first look may release on november


ముంబై: దర్శక దిగ్గజం శంకర్, తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రోబో 2.0. రోబోకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా కనిపించనుండగా..అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

కబాలి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న రజనీకాంత్ అభిమానులకు మరో తీపి కబురు అందింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రోబో 2.0 ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధి రాజు మహాలింగం సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. నవంబర్‌లో మూవీ ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

1548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles