విక్రమ్ తో పోరాడేది ఇతనేనా?

Mon,February 13, 2017 07:35 AM
rk suresh fight with vikram

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోను అంతే క్రేజ్ సంపాదించుకున్న వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్. వైవిధ్యమైన పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రెస్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్ అనే గూడాఛారి పాత్రలో విక్రమ్ కనిపించనుండగా, ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ఆడియన్స్ లో ఫుల్ హైప్ తెస్తున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న విక్రమ్ ని చూసి అభిమానులు... తమ అభిమాన హీరోని హాలీవుడ్ హీరోతో పోల్చుకుంటున్నారు.

స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘ధ్రువ నట్చత్తిరమ్’ చిత్రం ఫిబ్రవరి 10నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇందులో విక్రమ్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటించనుందని కొందరు అంటుంటే మరొ కొందరు తమన్నానే హీరోయిన్ అని కన్ ఫాం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ఇక లోకల్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్న విక్రమ్ తో పోటి పడేవారెవరు అనే దానిపై కొన్నాళ్ళ నుండి సస్పెన్స్ నెలకొంది. ఆ ఉత్కంఠ కి పులిస్టాప్ పెడుతూ చిత్రంలో విలన్ గా ఆర్కే సురేష్ ని ఎంపిక చేశారు.

విశాల్ నటించిన ‘మరుదు’, శశికుమార్ చేసిన ‘తారై తప్పట్టై’ చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సురేష్. విక్రమ్ కి ప్రతి నాయకుడిగా ఆర్కే సురేష్ అయితేనే సెట్ అవుతాడని భావించిన టీం వెంటనే ఆయనను విలన్ గా ఓకే చేసింది. ఇక థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీని ఆగస్ట్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ .

1393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS