తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న ప‌క్క రాష్ట్ర భామ‌

Wed,July 4, 2018 10:10 AM
Ritika Singh dub for neevevaroo

టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలో దశాబ్ధంకి పైగా సినిమాలు చేస్తున్న కాజ‌ల్ లాంటి భామ‌లు తెలుగు నేర్చుకునేందుకు ఆస‌క్తి చూప‌క‌పోయిన‌, ఇప్పుడొస్తున్న ప‌క్క రాష్ట్ర భామ‌లు మాత్రం తొలి సినిమాలోనే తెలుగు డ‌బ్బింగ్ చెబుతున్నారు. ఇది ఓ ర‌కంగా శుభ‌ప‌రిణామం అని చెప్ప‌వ‌చ్చు. ప‌రాయి రాష్ట్ర భామ‌లు అయిన‌ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌మంత‌, కీర్తి సురేష్ , అను ఎమ్మాన్యుయేల్‌, షాలిని పాండే, అదితి రావు హైద‌రి త‌దిత‌రులు రీసెంట్ చిత్రాల‌లో వారి పాత్ర‌ల‌కి వారే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా గురులో వెంకీ స‌ర‌స‌న న‌టించి మెప్పించిన రితికా సింగ్ త‌న పాత్ర‌కి తానే తెలుగు డ‌బ్బింగ్ చెబుతుంది.

రితికా సింగ్ ప్ర‌స్తుతం ల‌వ‌ర్స్ ఫేమ్ హ‌రినాథ్‌ ద‌ర్శ‌క‌త్వంలో నీవెవ‌రో అనే సినిమా చేస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, తాప్సీ కూడా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్, ఎమ్‌వీవీ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రితికాకి తెలుగులో రెండో సినిమా కాగా,ఈ మూవీలోని త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఇటీవ‌ల నీవెవ‌రో టైటిల్ పోస్ట‌ర్ నాని చేతుల మీదుగా విడుద‌ల కాగా, మూవీ ఫ‌స్ట్ లుక్‌ని కొర‌టాల శివ విడుద‌ల చేయ‌నున్నాడు. సాయి శ్రీరామ్ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, చిన్నా బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.


2337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles