మందు ఫ్రీగా పోస్తారని వచ్చారా?

Fri,December 15, 2017 03:34 PM
మందు ఫ్రీగా పోస్తారని వచ్చారా?

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మళ్లీ నోరు జారాడు. ఈసారి జర్నలిస్ట్‌లపై మాట తూలాడు. తన తండ్రి రాజ్‌కపూర్‌పై రాసిన ఓ పుస్తకం లాంచ్ సందర్భంగా వచ్చిన జర్నలిస్టులను అతను అవమానించాడు. బుక్‌ను పబ్లిష్ చేసిన హార్పర్ కొలిన్స్ నిజానికి మీడియాను ఆహ్వానించింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత రిషి కపూర్‌కు ముగ్గురు జర్నలిస్టులు ఎదురుపడ్డారు. మీరెవరు అని అతను వాళ్లను ప్రశ్నించాడు. మీడియా వాళ్లం అంటూ పరిచయం చేసుకున్న తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తూవెళ్తూ.. ఫ్రీగా మందు తాగే బాపతు అంటూ వారిని అవమానించేలా కామెంట్ చేశాడు. ఆ వెంటనే రిషి కపూర్‌కు చెందిన సెక్యూరిటీ వచ్చి ఆ ముగ్గురు జర్నలిస్టులను అక్కడి నుంచి బయటకు పంపించారు. రిషికి మీరు ఇక్కడ ఉండటం ఇష్టం లేదంటూ వాళ్లు ఆ మీడియా వాళ్లను పంపించేశారు. దీనిపై ఐటీసీ మౌర్య హోటల్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ స్పందించాడు. రిషి కపూర్ గురించి తెలుసు కదా. అతను ఇప్పటికే రెండుసార్లు మా హోటల్లో హంగామా సృష్టించాడు అని జర్నలిస్టులను సర్ది చెప్పారు.

3815

More News

VIRAL NEWS