మ‌హిళా అభిమానిపై నోరు పారేసుకున్న బాలీవుడ్ స్టార్‌

Sat,January 13, 2018 02:51 PM
Rishi Kapoor makes a female fan cry

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే రిషీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లుదు. నోటి దురుసుతో రెగ్యుల‌ర్‌గా వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటాడు ఈ బాలీవుడ్ న‌టుడు. గత ఏడాది డిసెంబ‌ర్‌లో జర్నలిస్ట్‌లపై నోరు జారిన రిషి క‌పూర్ 20 రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రో వివాదంతో వార్త‌ల‌లోకి ఎక్కాడు. ఫ్యామిలీతో ముంబయిలోని బాంద్రాలో పోష్‌ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఓ మ‌హిళా అభిమాని రిషి క‌పూర్‌తో ఫోటో తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించింద‌ట‌. దీంతో ఆమెపై దురుస‌గా వ్య‌వ‌హ‌రించాడు రిషి. చెడామడా మాట‌లు అన‌డంతో ఆ అభిమాని కంట త‌డి కూడా పెట్టింది. రిషి క‌పూర్ త‌న‌యుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ ప‌క్కే ఉన్న‌, ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా అక్క‌డి నుండి వెళ్ళిపోయాడు. గ‌త నెల‌లో తన తండ్రి రాజ్‌కపూర్‌పై రాసిన ఓ పుస్తకం లాంచ్ సందర్భంగా వచ్చిన జర్నలిస్టులను అవమానించిన సంగ‌తి తెలిసిందే. ఫ్రీగా మందు తాగే బాపతు అంటూ వారిని అవమానించేలా కామెంట్ చేసిన రిషి క‌పూర్ ప‌లువురిచే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు.

1780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles