నేనున్న స‌మయంలో నువ్వు ఎందుకు రాలేదు ప్రియా..

Sat,February 17, 2018 12:40 PM
Rishi Kapoor Is All Praise For Priya prakash

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఈ పేరు కేవ‌లం సౌత్‌కే పరిమితం కాలేదు. నార్త్‌లోను ఈ అమ్మ‌డికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా సెల‌బ్రిటీలు ప్రియా ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఫిదా అయి ట్విట్ట‌ర్ ద్వారా ప్రియాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌ల బ‌న్నీ ప్రియా ప్రకాశ్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌గా, రీసెంట్‌గా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రిషీ క‌పూర్ ప్రియాని ఆకాశానికి ఎత్తాడు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో మై డియ‌ర్ ప్రియా రానున్న రోజుల‌లో నీకు మంచి స్టార్ డ‌మ్ ల‌భిస్తుంది. భ‌విష్య‌త్‌లో నిన్ను చూసేందుకు జ‌నం పోటీప‌డుతుంటారు. అస‌లు నేనున్న స‌మయంలో నువ్వు ఎందుకు రాలేదు అంటూ ట్వీట్ చేశాడు రిషీ క‌పూర్‌. ప్రియా ప్ర‌కాశ్ న‌టించిన ఒరు ఆదార్ లవ్ అనే మ‌ల‌యాళ చిత్రం మార్చి 5న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది.


2895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS