గర్బిణిపై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

Thu,November 23, 2017 05:22 PM
గర్బిణిపై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

వివాదాలతో వార్తలలో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వారిలో బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఒకరు. ఆడవాళ్ళపై సంచలన కామెంట్స్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటాడు. ఆ మధ్య హాలీవుడ్ నటి కిమ్ కిర్ధాషియన్ ఫోటో ఒకటి పోస్ట్ చేసి అవి దుస్తులా.. లేక ఉల్లిపాయ మూటనా చమత్కరించాడు. ఇక తాజాగా అమెరికన్ పాప్ స్టార్ బియాన్సే ని టార్గెట్ చేస్తూ పూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ అంటూ తన సినిమా టైటిల్ పేరిట కామెంట్ చేశాడు. బియాన్సే ప్రస్తుతం నిండు గర్భిణీ కాగా, రీసెంట్ గా ఎరుపు రంగు గౌను ధరించి తలపై పూలు పెట్టుకొని ఉంది. ఈ ఫోటోపై రిషి కామెంట్ చేశాడు. దీంతో ఒళ్ళు మండిన నెటిజన్స్.. నిండు గర్భిణిపై అలా కామెంట్ చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు.
3034

More News

VIRAL NEWS