క్లాస్ మేట్ తో హీరోయిన్ నిశ్చితార్థం

Wed,January 16, 2019 07:28 PM
Richa Gangopadhyay engaged with her classmate

లీడర్, మిరపకాయ్, సరైనోడు, మిర్చి వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అమెరికన్ భామ రిచా గంగోపాధ్యాయ్. యూఎస్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ మేనేజ్ మెంట్ కోర్సు చేసేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రిచా తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. తన క్లాస్ మేట్ జోయ్ తో నిశ్చితార్థం పూర్తయినట్లు రిచా గంగోపాధ్యాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది.

జోయ్ తో నాకు నిశ్చితార్థం అయింది. బిజినెస్ స్కూల్ లో జోయ్ ను కలిశాను. రెండు అద్బుతమైన సంవత్సరాలు బిజినెస్ స్కూల్ లో గడిసాయి. నా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది రిచా గంగోపాధ్యాయ్. అయితే జోయ్, రిచా పెళ్లి తేదీ ఎపుడు అనేది మాత్రం చెప్పలేదు.
10477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles