చిరు చిన్న అల్లుడి స‌ర‌స‌న రియా

Tue,January 8, 2019 07:54 AM
rhea chakraborty to pair with kalyan dev

చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. జూలై 12, 2018న విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించిన, వ‌సూళ్ల విష‌యంలో డ‌ల్ అయింది. దీంతో త‌దుప‌రి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు క‌ళ్యాణ్‌. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో క‌ళ్యాణ్ త‌న రెండో సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమాని పులి వాసు తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. అయితే చిత్రంలో క‌ళ్యాణ్ కి జోడీగా తూనీగ తూనీగ ఫేం రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎంపిక చేశార‌ట. చాలా మంది ప‌రిశీలించిన త‌ర్వాత చిత్ర బృందం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. రియా హిందీలో ‘‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబి’’ సినిమాలతో యూత్‌కి బాగా చేరువైంది. మ‌రి త్వ‌ర‌లోనే ఈ వార్త‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇస్తారేమో చూడాలి.

3121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles