వ‌ర్మ 'క‌డ‌ప' వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Fri,December 15, 2017 11:42 AM
RGVs Kadapa Web Series Trailer

బోల్డ్ కంటెంట్ సినిమాలు తీయాలు అన్నా, ఫ్యాక్ష‌నిజాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించాల‌న్నా అది వ‌ర్మ‌కే సాధ్య‌మ‌ని కొంద‌రు చెబుతుంటారు. త‌న‌కి న‌చ్చిన క‌థ‌ల‌ని వెలుగులోకి తీసుకురావ‌డానికి సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో ఇప్పుడు వెబ్ సిరీస్ బాట ప‌ట్టాడు వ‌ర్మ‌. ఆ మ‌ధ్య ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో గ‌న్స్ అండ్ థైస్ సిరీస్ స్టార్ట్ చేసిన వ‌ర్మ ఇప్పుడు మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కడప అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్ పుట్టింద‌ని వ‌ర్మ అన్నాడు. అయితే తాజాగా క‌డ‌ప‌ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల చేశాడు. వ‌ర్మ వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ మొద‌లు కాగా, ఇందులో స‌న్నివేశాలని ఫ్యాక్ష‌నిజం ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా అనేలా చూపించాడు. ఇక మ‌ధ్య మ‌ధ్య‌లో పలు లీడ‌ర్స్ చెప్పిన మాట‌ల‌ని ట్యాగ్ లైన్స్ గా చూపించాడు. ట్రైల‌ర్ మాత్రం వ‌ర్మ మార్క్ లోనే ఉంద‌నే టాక్ వినిపిస్తుండ‌గా, తొలి వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని ఆయ‌న అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం నాగ్ మూవీతో బిజీగా ఉన్న వ‌ర్మ ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్‌తో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

1587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS