మీ డూపు గుళ్ళో క‌న‌బ‌డ్డాడు

Sat,October 27, 2018 09:17 AM
rgv shres funny cartoon

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ సినిమా గురించి విష‌యాలు వెల్ల‌డించే ముందు తిరుమ‌ల‌లో వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొన్నాన‌ని అన్నాడు. ఎన్టీఆర్‌పై గౌర‌వంతోనే శ్రీవారి పాదాల చెంత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లాంచ్ చేసిన‌ట్టు తెలిపాడు. అయితే పూజానంతరం వ‌ర్మ త‌న పిక్స్ కొన్నింటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నాస్తికుడిగా ఉండే వ‌ర్మ ఒక్క‌సారిగా ఆస్తికుడిగా మారే సరికి నెటిజ‌న్స్ కూడా షాక్ అయ్యారు. ఆయ‌న‌పై ఫ‌న్నీఎమ్మోజీలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ నెటిజ‌న్.. వ‌ర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో తనపై వచ్చిన ఓ కార్టూన్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘మీ డూప్ గుళ్లో కనబడ్డాడు’ అని క్యాప్షన్‌తో ఉన్న కార్టూన్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కార్టూన్‌పై నెటిజ‌న్స్ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం వ‌ర్మ పాత్ర‌ల‌ని ఎంపిక చేసిసే ప‌నిలో ఉన్న విష‌యం తెలిసిందే.

2449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles