జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా: రేణూ

Tue,June 19, 2018 01:41 PM
renu warning to power star fans

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత పిల్ల‌లే త‌న ప్ర‌పంచంగా కాలం గ‌డుపుతున్న రేణూ అప్పుడ‌ప్పుడు త‌న పిల్ల‌ల ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌ని ఆనందానికి గురి చేస్తుంటుంది. రీసెంట్‌గా రేణూ త‌న త‌న‌యుడు అకీరా సీరియ‌స్ లుక్‌లో ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నా త‌న‌యుడు ఈరోపియ‌న్ సినిమాలోని సీరియ‌స్ పాత్ర‌లా కనిపిస్తున్నాడు.. త‌న ల్యాప్‌టాప్‌లో ఓ గేమ్ కోసం తీవ్రంగా వెతుకున్న టైంలో క్లిక్‌మ‌నిపించిన ఫోటో ఇది. ఈ ఫోటోకి ఎవ‌రైన జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ అని కామెంట్ పెడితే వారి పోస్ట్‌ని డిలీట్ చేయ‌డంతో పాటు బ్లాక్ చేయ‌డం జ‌రుగుతుంది. అకీరాని జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అని పిల‌వ‌డం త‌న తండ్రికి కాని, త‌ల్లికి కాని, అకీరాకి కాని అస్స‌లు న‌చ్చ‌దు. ద‌య‌చేసి ఎవ‌రు జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అని పిల‌వొద్దని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది రేణూ.

ఇటీవ‌ల రేణూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్య‌క్తి చేయి ప‌ట్టుకొని దిగిన ఫోటోని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఓ క‌విత‌ని కామెంట్‌గా పెట్టింది. ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా’.. ఆ ప్రేమ కవిత్వంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నా... , ఈ ప్ర‌యాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతిని మర్చిపోయాను. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని వ్యక్తం చేశారు రేణూ దేశాయ్. త‌న‌కి కాబోయే భ‌ర్త గురించే రేణూ ఇలాంటి పోస్ట్ పెట్టింద‌ని నెటిజ‌న్స్ అనుకుంటున్నారు.

4190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles