మరోసారి మొహాన్ని దాచిన రేణూ దేశాయ్

Sat,July 14, 2018 04:04 PM
renu shares another pic of her fiance

తన పెళ్ళివిషయంలో కొద్ది రోజుల నుండి హాట్ టాపిక్ గా నిలుస్తుంది రేణూ దేశాయ్. పవన్ నుండి విడిపోయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత రేణూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనది పెద్దలు కుదిర్చిన సంబంధమే అని చెప్పిన రేణూ, అతను సినిమాకి చెందిన వ్యక్తి కాదని పేర్కొంది. అయితే రేణూ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు ప్రకటించిందో అప్పటి నుండి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు రేణూకి కాబోయే భర్తని పరిచయం చేయమని అడుగుతున్నారు.

ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకున్న రేణూ త్వరలో వివాహం చేసుకోనుంది. పెళ్లి తర్వాతే తనకి కాబోయే భర్త మొహాన్ని రివీల్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రేణూ. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేణూ తనకి కాబోయే భర్తతో కలిసి ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోలో అతని మొహాన్ని దాచిపెట్టి, కేవలం తను మాత్రం కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. దీంతో రేణూ అభిమానులు మరోసారి నిరూత్సాహానికి గురయ్యారు. అయితే తనకి కాబోయే భర్త గురించి పోస్ట్ పెట్టిన ప్రతీ సారి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతుండగా, తాజా పోస్ట్ పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

4211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles