ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా రేణూ..వ‌చ్చే వారం క‌లుస్తాన‌న్న న‌టి

Thu,October 17, 2019 12:06 PM

ప‌వ‌న్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో త‌న నిశ్చితార్ధం ఫోటోల‌తో పాటు ప‌లు విష‌యాల‌ని సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్‌లో ఒక‌టైన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షించింది . అయితే త‌న‌పై ప్ర‌తికూల వ్యాఖ్య‌లు ఎక్కువైన కార‌ణంగా నెగెటివిటీకి దూరంగా ఉండేందుకు ట్విట్టర్ ని డీయాక్టివేట్ చేశారు. తన గురించి నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి దూరంగా ఉండేందుకే ఇలా చేస్తున్నానని ట్విట్టర్ డిలీట్ చేసేముందు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న రేణూ.. ఇన్‌స్టాగ్రామ్‌కి కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌కి బాగా అల‌వాటుప‌డ్డాను. అందుకే ఇన్‌స్టాకి కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ త‌ప్ప మ‌రే సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్‌లో నేను లేను. వ‌చ్చే వారం మ‌ళ్ళీ క‌లుస్తాను. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్లాస్టిక్‌ని నిషేదించండి. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడండి అని పోస్ట్‌లో తెలిపింది రేణూదేశాయ్. వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే రైతుల నేప‌థ్యంలో ఓ సినిమా తెరకెక్కించేందుకు రేణూ క‌స‌ర‌త్తులు చేస్తుంది.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles