తెలుగు తెర‌కి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మైన రేణూ..!

Tue,July 24, 2018 10:17 AM
renu desai re entry into tollywood

గ‌త కొన్ని రోజులుగా త‌న రెండో పెళ్లికి సంబంధించి హాట్ టాపిక్‌గా మారిన రేణూ దేశాయ్ ఇప్పుడు కొత్త వార్త‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. బ‌ద్రి, జానీ వంటి చిత్రాల‌లో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించిన రేణూ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూర‌మైంది. ద‌ర్శ‌కురాలిగా, ఎడిట‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా, నిర్మాత‌గా ప‌లు విభాగాల‌లో పని చేసింది రేణూ. ఈ మ‌ధ్య తెలుగులో ఓ రియాలిటీ షోకి జ‌డ్జిగా కూడా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఇప్పుడు వెండితెర‌కు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రేణూ దేశాయ్ సిద్ధ‌మైంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల గోవాలో నిశ్చితార్ధం జ‌రుపుకున్న రేణూ అతి త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోనుంది. వివాహం త‌ర్వాత ఓ తెలుగు సినిమాలో ఆమె ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఓ యువ హీరోకి వ‌దిన పాత్ర‌లో రేణూ మెరుస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పెళ్ళి చేసుకొని విదేశాల‌కి వెళుతుంద‌నుకున్న రేణూ మ‌ళ్ళీ కెరీర్ ప‌రంగా కొత్త జీవితాన్ని మొద‌లు పెట్ట‌నుంద‌నే వార్త అభిమానుల‌కి ఎక్క‌డ‌లేని ఆనందాన్ని అందిస్తుంది. కొత్త భాగ‌స్వామితో పాటు కొత్త సినీ కెరీర్ మొద‌లు పెట్ట‌నున్న రేణూకి ఆమె అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

3909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles