జ్ఞాప‌కాల‌ని వీడియో ద్వారా తెలిపిన ప‌వ‌న్ మాజీ భార్య‌

Fri,February 23, 2018 09:31 AM
renu desai poetry video gets crazy

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అప్‌క‌మింగ్ ప్రాజెక్టుల‌కి సంబంధించిన విష‌యాల‌నే కాక పర్స‌నల్ విష‌యాలని కూడా త‌న అఫీషియ‌ల్ పేజ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మ‌ల్టీ టాలెంట్ ఉన్న రేణూ త‌న హాబీగా క‌విత‌లు కూడా రాస్తుంటారు. వాటికి పుస్త‌క రూపం ఇవ్వాల‌ని తాను భావిస్తున్నట్టు గ‌తంలోనే తెలిపారు. త‌ను ఇంగ్లీష్‌లో రాసుకున్న క‌విత‌ల‌ను తెలుగులోకి అనువాదం చేసేందుకు ప్ర‌సాద్ మూర్తితో జ‌ట్టు క‌ట్టారు. ఇటీవ‌ల‌ రేణూ తన ఫేస్ బుక్ పేజ్‌లో ఇంగ్లీష్‌లో ఒమేగా, తెలుగులో కారుమ‌బ్బుల కాంతి మండలం అనే పేరుతో ఉన్న చిన్న‌ క‌విత‌ని పోస్ట్ చేశారు. ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

తాజాగా త‌న జ్ఞాప‌కాల‌ని క‌విత‌తో కూడిన వీడియో ద్వారా చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. ఇది అభిమానుల గుండెల‌ని పిండేస్తుంది. ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో ఉన్న ఓ వీడియోని రీసెంట్‌గా త‌న ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన రేణూ ఇందులో .. నా జ్ఞాప‌కాల‌ని మ‌ళ్ళీ చూసుకుంటున్నాను. ఆయ‌న మాట‌లు, ప‌దాలు, ఆయ‌న పేరు చెక్కిన క‌లం ఇప్ప‌టికి నా జ్ఞాప‌కాలుగా ఉన్నాయి. క‌మ్ముకున్న మంచు క‌రిగిపోయి మ‌ళ్ళీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్ళెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయమైన‌ది. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాల‌ని మ‌ళ్ళీ త‌ట్టి లేపుతుంది. ఆ జ్ఞాప‌కాల‌ని మ‌ళ్ళీ చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచి పెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖ‌ల కాగిత‌పు ముక్క‌లు మాత్ర‌మే కనిపించాయి అంటూ ఎంతో బాధ‌తో, ఆవేద‌న‌తో త‌న జ్ఞాప‌కాల‌ని క‌విత ద్వారా తెలిపింది రేణూ దేశాయ్.4106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles