ప‌వ‌న్‌-అన్నాల‌తో అకీరా.. క్లారిటీ ఇచ్చిన రేణూ

Sun,June 24, 2018 08:45 AM
RENU DESAI GIVES CLARITY ON AKIRA MEETS PAWAN IN HYD

ఈ మ‌ధ్య ప‌వ‌న్‌- అన్నాల‌తో క‌లిసి ఉన్న అకీరా ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. స‌రిగ్గా అకీరాని జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ అని పిల‌వొద్ద‌ని రేణూ హెచ్చరించిన కొన్ని రోజుల‌కే ఆ ఫోటో బ‌య‌ట‌కి రావ‌డంతో అభిమానుల‌లో సందేహాలు పెరిగిపోయాయి. అకీరాని జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ పిల‌వొద్ద‌ని చెప్పిన రేణూ త‌న త‌న‌యుడిని ఎందుకు ప‌వ‌న్ ద‌గ్గ‌రికి పంపింది, ఇక అకీరా ప‌వ‌న్ ద‌గ్గ‌రే ఉండి చ‌దువుకోనున్నాడా , త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న రేణూ త‌న పిల్ల‌వాడిని ప‌వ‌న్ ద‌గ్గ‌రికి ఎందుకు పంపిచిన‌ట్టు .. ఇలా ఎన్నో డౌట్స్ నెటిజ‌న్స్ మదిలో మెదిలాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ‌కి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ నుండి త‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌ని కొన‌సాగించ‌నున్న ప‌వ‌న్ కొన్నాళ్లుగా జ‌రుగుతున్న రాజ‌కీయ‌ యాత్ర‌కి బ్రేక్ ఇచ్చి కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు. ఆ సమయంలో పవన్ తో పాటు ఉండేందుకు అకీరా పూణే నుండి డైరెక్ట్ గా విజయవాడ వచ్చాడని అన్నారు. పవన్ ని ఓ హోటల్ రూం నుండి కారు దగ్గరకి తీసుకొచ్చే సమయంలో తన కుమారుడిని ఎత్తుకొని ఉన్న అన్నా లెజీనోవాతో అకీరా కనిపించే స‌రికి నెటిజ‌న్స్ డైరెక్ట్‌గా రేణూని ప్ర‌శ్నించారు. దీనిపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది రేణూ. తన స్కూల్ హాలీడేస్‌ని తండ్రితో క‌లిసి గ‌డిపేందుకే విజ‌య‌వాడ వెళ్ళాడు. హైద‌రాబాద్ షిఫ్ట్ అయ్యాడ‌నే వార్త‌లు అవాస్త‌వం. విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో అకీరా కనిపించ‌డంతో నాకు వ‌రుస‌గా మెసేజెస్ వ‌స్తున్నాయి. అందుకే క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని రేణూ అన్నారు .


4852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS