త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్న వారికి మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రేణూ

Fri,July 13, 2018 12:35 PM
renu desai clarifies about troll postings

ప‌వ‌న్ మాజీ భార్య రేణూ దేశాయ్ త‌న రెండో పెళ్లి విష‌యంపై ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుండి ప‌వ‌న్ అభిమానులు ఆమెని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవ‌ల త‌న యూట్యూబ్‌లో రేణూ పోస్ట్ చేసిన ఇంట‌ర్వ్యూ వీడియోపై కూడా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొద‌ట విడాకులు చెప్పాడ‌ని రేణూ అన‌డంతో అభిమానులు పొలేనా పుట్టిన స‌మ‌యం, రేణూ ఆర్కే షో లో ఇంట‌ర్యూ ఇచ్చిన విష‌యాలు అన్నీ ప్ర‌స్థావ‌న‌కి తెస్తూ ఆమెను సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో రేణూ దేశాయ్ పీఆర్ టీం పొలెనా పుట్టిన స‌మ‌యం, తాను విడాకులు తీసుకున్న స‌మ‌యం గురించి వివ‌రిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.

బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. (9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011). విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తరువాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, స్వప్న గారితో రేణు గారి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. పాప పుట్టిన విషయం ఆమెకు తెలిసిన తరువాత శుభాకాంక్షలు తెలిపారు, ఈ విషయాన్నే RK గారి ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారు. ఈ విషయాన్నే ఆవిడ స్వప్న గారితో ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆవిడ PR టీం గా మేము ఈ వివరాలను తెలియచేసి, ఆమె అబద్దం చెప్పారన్న గందరగోళాన్ని తొలిగించడానికే ఈ పోస్ట్ పెట్టాము అంటూ క్లారిటీ ఇచ్చారు.

2813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS