2016లో టాలీవుడ్ రీమేక్స్

Fri,December 30, 2016 08:31 AM
remake in tollywood

2016లో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్స్ పై మోజు పెరిగింది. స్టార్ హీరోస్ కూడా రీమేక్ అయితే బాగుంటుందని ఆలోచించారు. ఒక భాషలో హిట్ అయిన పిక్చర్ తీసుకుని దానికి తెలుగు మెరుగులు అద్ది, నేటివిటీ తెచ్చి రిలీజ్ చేస్తున్నారు. అవి హిట్ అయ్యాయి కూడా. వేరే భాషలో సక్సెస్ అయిన మూవీని టేకప్ చేస్తే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందన్న ఆలోచన కూడా ఇందుకు కారణం. 2016లో ఏకంగా 11 రిమేక్స్ కు ప్లాన్ వేశారు. వాటిలో కొన్ని రిలీజై బాగా ఆడాయి. కొన్ని మేకింగ్ లో ఉన్నాయి. రీమేక్స్ పై హావ్ ఏ లుక్.

డైరెక్ట్ సినిమా తీసి చేతులు కాల్చుకునే కన్నా రీమేక్ తీసి తమ లక్ ఎలా ఉంటుందో ఒక లుక్ వేద్దామనుకున్నారు మన హీరోలు, నిర్మాతలు. రీమేక్స్ పై కన్నేసినవాళ్లలో స్టార్ హీరోసే ఎక్కువ. తొమ్మిదేళ్ల తర్వాత నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తన 150వ సినిమా డైరెక్ట్ పిక్చర్ కన్నా రీమేక్ అయితే బాగుంటుందని థింక్ చేశాడంటే రీమేక్ ఇంపాక్ట్ టాలీవుడ్ పై ఎంత బలంగా ఉందో తెలుస్తూనే ఉంది. రీమేక్స్ పై టాలీవుడ్ లో ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం గతంలో టాగోర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, గబ్బర్ సింగ్, దృశ్యం వంటి రీమేక్స్ సూపర్ హిట్ కొట్టడమే.

ఈ ఏడాది రీమేక్స్ విషయానికి వస్తే ..తమిళ సినిమా కత్తి ఆధారంగా ఖైదీ నంబర్ 150 పేరుతో చిరంజీవి 150వ సినిమా తీస్తున్నారు. తని ఒరువన్ అనే తమిళ సినిమాను బేస్ చేసుకొని చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ధృవ సినిమా తీసి రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇన్ టచబుల్స్ అనే హాలీవుడ్ పిక్చర్ స్టోరీ ఆధారంగా నాగార్జున ఊపిరి సినిమా తీసి హిట్ కొట్టాడు. విక్కీ డోనర్ మూవీ ఆధారంగా సుమంత్ హీరోగా అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నరుడా – డోనరుడా పిక్చర్ వచ్చింది.

మలయాళీ సినిమా ప్రేమమ్ ఆ భాషలో బిగ్ హిట్ కావడంతో తెలుగులో నాగచైతన్య హీరోగా ఆ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశారు. నాగార్జున ఊపిరి లెవెల్ లో ఈ మూవీ ఘన విజయం సాధించకున్నా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ మధ్య నారా రోహిత్ హీరోగా వచ్చిన శంకర మౌన గురు అనే తమిళ సినిమాకు రీమేక్. సాయిధరమ్ తేజ్ యాక్ట్ చేసిన తిక్క మూవీ మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి మూవీకి రీమేక్. రవితేజతో స్పెషల్ 26 అనే మూవీని రీమేక్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇక పవన్ చేస్తోన్న కాటమరాయుడు వీరమ్ కి రీమేక్ కాగా, త్వరలో వేదాళంని రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్ టీ నీసన్ తెరకెక్కించనున్నాడు.

ఏదేమైన 2016 సంవత్సరంలో రీమేక్ లకు పంటపండిదనే చెప్పవచ్చు. అందుకే అవే రీమేక్స్ తో 2017 కూడా సినీ లవర్స్ కి మంచి వినోదాన్ని అందించే ఛాన్స్ ఉంది.

1329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles