చిరంజీవిపై కేసు ర‌ద్దు చేసిన హైకోర్టు

Thu,March 14, 2019 09:37 AM
relief for chiranjeevi

2014లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని చిరంజీవి ఉల్లంఘించారంటూ గుంటూరు అరండల్‌పేట్‌ ఠాణాలో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. 2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. దీనిని స‌వాలు చేస్తూ చిరంజీవి హైకోర్టుని ఆశ్ర‌యించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్నారని, కాని అధికారులు పిటీష‌న‌ర్‌పై అక్ర‌మంగా కేసు న‌మోదు చేశార‌ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వివ‌రాల‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. చిరంజీవిపై నమోదు చేసిన కేసును రద్దు చేస్తున్న‌ట్టు తెలిపారు. చిరంజీవి ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సైరా న‌ర‌సింహ‌రెడ్డి చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

2032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles