హృతిక్ 'సూప‌ర్ 30 'చిత్రాన్ని వెంటాడుతున్న స‌మ‌స్య‌లు

Sun,May 19, 2019 07:36 AM
Release Date Of Super 30 Pushed Forward

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా సూప‌ర్ 30 అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఎంద‌రికో స్పూర్తిని క‌లిగించిన ఆనంద్ కుమార్ బ‌యోపిక్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది. అయితే ఈ చిత్ర రిలీజ్‌కి అడుగ‌డుగున స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన వికాస్ బాల్ మీటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో ఆయ‌న‌ని తొల‌గించి వేరే న‌టుడిని చేర్చి షూటింగ్ జ‌రిపారు. దీని వ‌ల‌న కొన్నాళ్ళు మూవీ డిలే అయింది. కొన్నాళ్ళ క్రితం జూలై 26న మూవీని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని అదే రోజు కంగ‌నా ర‌నౌత్ మెంట‌ల్ హై క్యా విడుద‌ల కానుండ‌డంతో హృతిక్ త‌న సినిమాని వాయిదా వేస్తున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్రాన్ని ఆగ‌స్ట్ 2 లేదంటే 9న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. మ‌రి ఆ రోజైన చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా లేదా అనేది చూడాలి.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles