హీట్ పుట్టిస్తున్న శృతీ సాంగ్

Thu,February 25, 2016 03:40 PM
REHNUMA Video Song

కమల్‌ గారాల పట్టీ శృతీ హాసన్ ఇన్నాళ్ళు పెట్టుకున్న హద్దులను చెరిపేసుకున్నట్టు కనిపిస్తుంది. మొదట్లో సాంప్రదాయబద్దంగా సినిమాలు చేసిన శృతీ ఆ తర్వాత గ్లామర్‌ డోస్‌ మరింత పెంచింది. ప్రస్తుతం ఈ అమ్మడు రాఖీ హ్యండ్సమ్‌ అనే చిత్రంలో జాన్‌ అబ్రహమ్‌ సరసన నటిస్తుండగా, ఈ చిత్రం 2010లో వచ్చిన కొరియన్ ఫిల్మ్ ‘ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్' అనే సినిమా ఆధారంగా తెరకెక్కుతుంది.

యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న రాఖీ హ్యండ్సమ్‌ చిత్రంలో శృతి హాసన్ జాన్ అబ్రహం భార్యగా నటిస్తుండగా, దివ్య అనే ఏడేళ్ల బాల నటి ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ ఐటం గర్ల్ నథాలియా గర్ల్ ఈ చిత్రంలో దివ్య కు తల్లి పాత్రలో చేస్తుంది. రూ. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జాన్ అబ్రహాంకు చెందిన జాన్ అబ్రహాం ఎంటర్టెన్మెంట్స్, సునీర్ కేత్రపాల్ కు చెందిన అజురె ఎంటర్టెన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రాఖీ హ్యండ్సమ్‌ అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రమోషన్‌లో భాగంగా ఓ సాంగ్‌ను విడుదల చేసారు. ఇందులో శృతి ఎన్నడు లేనంతగా రొమాన్స్‌ చేయగా ఈ వీడియో అందరిని ఆకర్షిస్తుంది. మరి ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.


4178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles