షాకింగ్ లుక్‌లో రెజీనా క‌సాండ్రా

Thu,December 14, 2017 12:01 PM
regina shocking look

కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రెజీనా ప్ర‌స్తుతం నాని నిర్మాణంలో రూపొందుతున్న ‘అ!’ అనే సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. వాల్ పోస్ట‌ర్ బేన‌ర్‌పై ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తున్న‌ ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియ‌ద‌ర్శిని లీడ్ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, ర‌వితేజ వాయిస్ ఇవ్వ‌డం విశేషం. చేప అనే పాత్ర‌కి నాని, మొక్క అనే పాత్ర‌కి ర‌వితేజ వాయిస్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ప్ర‌ధాన పాత్ర‌ల ఫోటోలు రిలీజ్ చేస్తున్న నాని తాజాగా రెజీనా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రెండు షాకింగ్‌ లుక్స్ విడుద‌ల చేసారు. ఇందులో రెజీనా చేతులు, వీపుపై టాటూలు, భిన్న కేశాలంకరణతో ప్రతినాయికలా కనిపిస్తోంది. ‘నువ్వు ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు రెజీనా. ‘అ!’ చిత్ర బృందం నుంచి.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని తెలిపాడు నాని. దీనికి రెజీనా స్పందిస్తూ.. ‘‘ఇది నాకు ఉత్తమ పుట్టినరోజు బహుమతి నాని’’ అని తెలిపింది. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఛాయాగ్రాహ‌కుడిగా ప‌నిచేస్తున్నాడు.2064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS