డ్యాన్స్ టీచ‌ర్ అవ‌తారం ఎత్త‌నున్న యంగ్ హీరోయిన్

Tue,February 12, 2019 01:05 PM

కెరీర్ తొలి నాళ్ళ‌లో యంగ్ హీరోల‌తో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న భామ రెజీనా. కొద్ది రోజులుగా రెజీనాకి సరైన హిట్స్ రావ‌డం లేదు. దీంతో ఆమె ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించాల‌నుకుంటుంది. అ! లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన రెజీనా ఇటీవ‌ల బాలీవుడ్ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్ చేసింది. అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’లో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్‌ కపూర్‌ ప్రియురాలిగా రెజీనా నటించి మెప్పించింది. ఆమె పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక ఇప్పుడు డ్యాన్స్ టీచ‌ర్‌గా న‌టించేందుకు సిద్ధ‌మైంది.


అర‌వింద్ స్వామి ప్ర‌ధాన‌ పాత్ర‌లో మూవింగ్‌ ఫ్రేమ్‌ బ్యానరుపై ఎస్‌.పార్తి, దీనా నిర్మిస్తున్న చిత్రం ‘కల్లపార్ట్‌’. హరీష్‌, ఆదేష్‌, బాబ్రిఘోష్‌, రాక్షసన్‌ ఫేమ్‌ బేబి మోనికలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం సమకూర్చుతున్నారు. రాజపాండి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా డ్యాన్స్ టీచ‌ర్‌గా అల‌రించ‌నుంద‌ట‌. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ పూర్తి కాగానే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్రంతోనైన రెజీనాకి మ‌రిన్ని ఆఫర్స్ రావాల‌ని కోరుకుందాం.

2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles