కుర్ర హీరోయిన్స్ బాట‌లోనే రెజీనా

Thu,May 17, 2018 08:34 AM
Regina Cassandra completes dubbing for mister Chandramouli

రెజీనా క‌సాండ్రా.. ఒక‌ప్పుడు ఈ అమ్మ‌డు యూత్ క‌ల‌ల రాణి. కొన్నాళ్ళు త‌న న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్‌తో ఓ ఊపు ఊపిన రెజీనా తెలుగులో స‌రైన ఆఫ‌ర్స్ అందుకోలేక‌పోయింది. అడ‌పాద‌డ‌పా చేసిన సినిమాలు డివైడ్ టాక్ రావ‌డంతో తెలుగులో రెజీనాకి ఆఫ‌ర్స్ రావ‌డ‌మే కరువ‌య్యాయి. అయితే త‌మిళంలో మాత్రం ఈ అమ్మ‌డు బాగానే సినిమాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తమిళ్‌లో ఆమె నటించిన చిత్రం ‘మిస్టర్ చంద్రమౌళి’. సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడైన గౌతం కార్తీక్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కార్తీక్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రెజీనా త‌న పాత్ర‌కి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంద‌ట‌.త‌మిళంలో రెజీనా డ‌బ్బింగ్ చెప్పింద‌నే వార్త బ‌య‌ట‌కి రావ‌డంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్న రెజీనా ఇందులో బికినీతో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. అయితే తెలుగులో ప‌లు చిత్రాలు చేసిన రెజీనా ఏ చిత్రానికి డ‌బ్బింగ్ చెప్పుకోక‌పోవ‌డం విశేషం. ప‌క్క రాష్ట్రాల భామ‌లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కీర్తి సురేష్‌, స‌మంత‌, అను ఎమ్మాన్యుయేల్ వంటి వారు ఇప్పుడు తెలుగులో వారి పాత్ర‌ల‌కి వారే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. తాజాగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న స‌మ్మాహ‌నం సినిమా కోసం అదితి రావు హైద‌రి డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇది ఓ ర‌కంగా శుభ‌ప‌రిణామం అని చెప్ప‌వ‌చ్చు.

2842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles