ఒకే తెరపై ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ?

Fri,February 1, 2019 08:36 AM
Rebel Star prabhas To Make Cameo In RRR

బాహుబ‌లి చిత్రంతో సంచ‌నాలు సృష్టించిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే త‌న ప్ర‌తి చిత్రాన్ని జ‌నాల‌లోకి సులువుగా తీసుకెళ్ళే రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా వినూత్న ప్రచారం చేసుకుంటున్నాడు. భారీ తార‌గ‌ణంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నాడ‌ని తాజా స‌మాచారం. ఓ కీల‌క పాత్ర‌లో న‌టించమ‌ని రాజ‌మౌళి, ప్ర‌భాస్‌ని కోర‌గా ఆయ‌న వెంట‌నే ఓకే అనేశాడ‌ట‌. దీంతో ఒకే తెర‌పై ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌నిపించ‌నున్నార‌ని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. చిత్రంలో క‌థానాయిక‌లుగా కీర్తి సురేష్‌, ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు రాగా, ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని .. చరణ్ కు బాబాయ్ గా నటించనున్నాడని అన్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

4215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles