హిందీలో 'సాహో' హ‌వా

Tue,September 17, 2019 01:45 PM

ప్రభాస్‌ కథానాయకుడిగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 424కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అయితే హిందీలో ఈ చిత్రం 153 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించిన‌ట్టు పోస్టర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. అత్యున్నత సాంకేతిక నిపుణులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అలరించ‌క‌పోయిన హిందీలో మాత్రం హ‌వా చూపిస్తుంది. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్‌కి నేష‌న‌ల్ స్టార్‌డం రాగా, ఈ మూవీతో మ‌రింత పెరుగుతుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన సాహో చిత్రంలో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌గా, బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో చిత్రం రానున్న రోజుల‌లో 500 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

3870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles