సోష‌ల్ మీడియాలో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్

Thu,November 22, 2018 11:46 AM
Rebel Star prabhas has A Huge Following On Facebook

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా అశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ప‌లు సామాజిక మాధ్య‌మాల‌లో త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన వివ‌రాలు అందిస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని క‌లుగ‌జేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన ప్ర‌భాస్ మాత్రం కేవ‌లం సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్‌లో ఒక‌టైన ఫేస్ బుక్‌ని మాత్ర‌మే వాడుతున్నాడు. ఇందులో ప్ర‌భాస్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ప‌ది మిలియ‌న్స్‌కి చేరింది. అతి త‌క్కువ టైంలో ప్రభాస్ ఈ ఫీట్‌ని సాధించగా, సౌత్‌లో ప‌ది మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సాధించిన తొలి న‌టుడు ప్ర‌భాస్ కావ‌డం విశేషం. ప్ర‌భాస్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్ చేర‌డంతో ఈ ఆనంద స‌మ‌యాన్ని ఫ్యాన్స్ పండుగ‌లా చేసుకుంటున్నారు.

2032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS