సంక్రాంతి బ‌రిలో చిట్టిబాబు

Sat,June 16, 2018 01:30 PM
rc 12 movie release for pongal

సంక్రాంతి పండుగ‌కు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు విడుద‌ల కావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన సినిమాలు స‌రిగ్గా సంద‌డి చేయ‌క‌పోవడంతో వ‌చ్చే ఏడాది సంక్రాంతిపై అభిమానుల దృష్టి ప‌డింది. ప్ర‌స్తుతం సెట్స్‌పైన పలువురు టాప్ హీరోల సినిమాలు ఉండ‌గా, వాటిలో ఏ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో ముందుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న తాజా చిత్రం సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించాడు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ 12వ చిత్రం డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతుంది. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌ షెడ్యూల్ త్వ‌ర‌లోనే జ‌రుపుకోనుంది.

రామ్ చ‌రణ్ 12వ‌ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ‌వంశ‌స్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. 2016 సంక్రాంతికి చిరు రీ ఎంట్రీతో అద‌ర‌గొడితే , 2017 సంక్రాంతికి అజ్ఞాతవాసి తో ప‌వ‌న్ సంద‌డి చేశాడు . ఇక ఇప్పుడు చ‌ర‌ణ్ వంతు వ‌చ్చింది. సంక్రాంతి బ‌రిలో త‌న చిత్రాన్ని నిలిపి మంచి విజ‌యం సాధించాల‌ని చిట్టిబాబు ఆశిస్తున్నాడు.

1987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles